![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -647 లో..... టైం కి అప్పు నందగోపాల్ ని తీసుకొని రావడం తో అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. అందుకు సీతారామయ్య అప్పుకి థాంక్స్ చెప్తాడు. ఇదంతా చేసింది ఎవరో కాదు.. ఆ అనామిక, సామంత్ లు అని అప్పు అంటుంది. వాళ్ళ సంగతి చెప్తానంటూ రాజ్ కోపంగా వెళ్తుంటే.. కావ్య వెనకే వెళ్తుంది. మరొకవైపు సామంత్ తో ప్రాజెక్ట్ డీలింగ్ పెట్టుకోవడానికి వేరొక కంపెనీ నుండి ఇద్దరు వస్తారు. సామంత్ గదిలో ఉండగా అనామిక వెళ్లి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు పదా అని అంటుంది.
అయిదు కోట్లు అప్పు చేసి వాళ్ళని ఇక్కడికి రప్పించాను కానీ ఇప్పుడు వాళ్ళు ఒకే అంటారో లేదో అని సామంత్ టెన్షన్ పడుతుంటే.. వాళ్ళు ఒప్పుకుంటారు. నేను అంతా చూసుకుంటానని అనామిక అంటుంది. అప్పుడే ఎవరో ఫోన్ చేసి నందగోపాల్ రాజ్ కి దొరికాడని చెప్పగానే సామంత్ షాక్ అవుతారడు. ఆ విషయం అనామికకి చెప్పగానే తను షాక్ అవుతుంది. అలా ఎలా జరిగిందని అనామిక అంటుంది. ఆ రాజ్ అసలు ఊరుకోడని సామంత్ టెన్షన్ పడుతుంటే.. అది తర్వాత చూసుకుందాం ముందు వాళ్ళు వెయిట్ చేస్తున్నారని అనామిక సామంత్ ని కిందకి తీసుకుని వెళ్తుంది. వాళ్ళతో డీలింగ్ మాట్లాడుతుంటే.. అప్పుడే రాజ్ వచ్చి సామంత్ ని కొడతాడు. నీ కంపెనీ కొనే ఛాన్స్ వచ్చినా నేను కొనలేదు కానీ ప్రతిసారీ ఇలానే చేసావని రాజ్ అంటుంటే.. సామంత్ ని వదులు అంటూ అనామిక అంటుంది. దాంతో తనపై కూడ రాజ్ కోప్పడతాడు. అనామిక చెంప చెల్లుమనిపిస్తుంది కావ్య. ఇద్దరికి రాజ్, కావ్య వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతారు. మీరు ఏదో మంచి వారు అనుకున్నాము కానీ ఇలాంటి వారని తెలియదంటూ డీలింగ్ కి వచ్చిన వాళ్ళు వద్దని వెళ్ళిపోతారు. దాంతో సామంత్ ఇంకా అవమానంగా ఫీల్ అవుతాడు.
మరొకవైపు అప్పు చేసిన పనికి కళ్యాణ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. రాజ్, కావ్య ఇంటికి వస్తారు. ఇన్ని రోజులు వీళ్ళని తప్పుగా అర్థం చేసుకున్నామని అపర్ణ అంటుంది. నేనొక నిర్ణయం తీసుకున్నాను. ఆస్తులు వాటాలు పంచాలనుకుంటున్నానని సీతారామయ్య అంటాడు. వద్దని కావ్య అంటుంది. ముసలోడు మంచి నిర్ణయం తీసుకున్నాడని రుద్రాణి అనుకుంటుంది. నన్ను క్షమించండి నాన్న.. అందరం కలిసి ఉందామని సీతారామయ్య కాళ్ళ పై పడి అడుగుతాడు ప్రకాష్. తరువాయి భాగంలో అప్పు, కళ్యాణ్ లు తిరిగి ఇంటికి వస్తారు. వాళ్ళకి కావ్య హారతి ఇచ్చి ఆహ్వానిసిస్తుంది. ఇక ఈ చీడపురుగులు అయిన రాహుల్, రుద్రాణి లని ఇంట్లో నుండి పంపేద్దామని ఇందిరాదేవి అనగానే అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |